మద్దతు ధరకు మొక్కజొన్న కొనుగోలు: మంత్రి
BPT: మంత్రి గొట్టిపాటి రవికుమార్ రైతులకు శుభవార్త చెప్పారు. సంతమాగులూరు మండలం కామేపల్లిలో పర్యటించిన ఆయనకు.. స్థానిక మొక్కజొన్న రైతులు కలిసి పంటకు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్నామని విన్నవించారు. స్పందించిన ఆయన ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్రానికి లేఖ పంపామని.. త్వరలోనే మద్దతు ధరకు మొక్కజొన్నలు కొనుగోలు చేస్తామన్నారు. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు.