అక్రమ కలప పట్టివేత.. నిందితుడు అరెస్ట్
ADB: ఇచ్చోడ మండలంలోని గుండాల నుంచి ఆదిలాబాద్‌కు అక్రమంగా తరలిస్తున్న 18 కలప దుంగలను ఫారెస్ట్ అధికారులు దస్నాపూర్ వద్ద పట్టుకున్నారు. రూ. 64 వేల విలువైన కలపను స్వాధీనం చేసుకున్నట్లు ఎఫ్ఎఓ చిన బుస రెడ్డి తెలిపారు. వాహన డ్రైవర్ షేక్ అబ్బును అరెస్టు చేయగా, మరో ముగ్గురు పరారయ్యారు. అక్రమ కలప రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.