నేటి నుంచి జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు
AKP: నర్సీపట్నం ఈపీడీసీఎల్ డివిజన్ పరిధిలో నేటి నుంచి జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు నిర్వహిస్తున్నామని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అప్పారావు తెలిపారు. ఇంధన పొదుపుపై అవగాహన ర్యాలీ ఉంటుందన్నారు. విద్యార్థులకు వ్యాసరచన, డిబేట్ పోటీలు నిర్వహిస్తామన్నారు. డ్వాక్రా మహిళల చేత ముగ్గుల పోటీలు ఉంటాయన్నారు. ప్రజలలో అవగాహన తీసుకురావడానికి అనేక కార్యక్రమాలు చేపడతామన్నారు.