బీజేపీ ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాలు పంపిణీ

బీజేపీ ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాలు పంపిణీ

కోనసీమ: మట్టిగణపతినే పూజించి పర్యావరణాన్ని కాపాడే యజ్ఙంలో భాగమవుదామని రాష్ట్ర యువ మోర్చా అధికార ప్రతినిధి పాలూరి జయ ప్రకాష్ నారాయణ అన్నారు. మంగళవారం రావులపాలెం సెంటర్‌లో జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో ఉచిత మట్టి గణపతి విగ్రహాలు పంపిణీ చేశారు. అనంతరం చవితి మండపాలకు ఉచిత విద్యుత్తు ప్రకటించిన మంత్రి లోకేష్‌కు అభినందనలు తెలిపారు.