మహిళ కళ్ల ల్లో కారం కొట్టి.. బంగారం దొంగతనం

NLR: కొండాపురం మండలం చల్లగిరిగలలో గురువారం ఒక మహిళపై దారుణం జరిగింది. పత్తి పొలంలో పనిచేస్తున్న యారవ లక్ష్మమ్మ కళ్ళల్లో కారం కొట్టి, ఆమె మెడలో ఉన్న 5 సవర్ల బంగారు గొలుసును ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.