VIDEO: రుద్రేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే
HNK: హన్మకొండ వేయి స్తంభాల దేవాలయంలో కార్తీక మాసోత్సవాలను బుధవారం జ్యోతి వెలిగించి ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి దంపతులు రుద్రేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ.. కార్తీక మాసం ప్రతి హిందువుకూ పవిత్రమైనదని, భక్తి శ్రద్ధలతో దీపాలు వెలిగించి శివాలయాల సందర్శన చేయాలని ప్రజలను కోరారు.