అగ్నిమాపక వారోత్సవాలలో పాల్గొన్న ఇంఛార్జ్

అగ్నిమాపక వారోత్సవాలలో పాల్గొన్న ఇంఛార్జ్

అన్నమయ్య: రాజంపేటలో మంగళవారం అగ్నిమాపక వారోత్సవాలను నిర్వహించారు. ఈ వారోత్సవాలలో టీడీపీ ఇంఛార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు పాల్గొని మాట్లాడారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటే అగ్ని ప్రమాదాలను నివారించవచ్చన్నారు. అగ్నిమాపక సిబ్బంది సేవలు ఆదర్శప్రాయమని, విపత్తుల సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలను, ఆస్తులను కాపాడుతారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.