ముసలమ్మ అమ్మవారికి లక్ష గాజుల అలంకరణ

W.G: భీమవరం 24వ వార్డులోని రామాయణం సుబ్బన్నతోటలో కొలువైన శ్రీపుంతలో ముసలమ్మ అమ్మవారికి శ్రావణ శుక్రవారం సందర్భంగా సుమారు లక్ష గాజులతో అద్భుతమైన అలంకరణ చేశారు. అమ్మవారికి అభిషేకాలు, కుంకుమ పూజలు నిర్వహించిన అనంతరం మహిళా సేవకులు లలిత సహస్ర పారాయణం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, మహిళా సేవకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.