సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ

సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ

ELR: బడుగు బలహీన వర్గాలకు ఆర్ధిక సహకారంగా సీఎం సహాయ నిధి ఎంతగానో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అన్నారు. శనివారం జిలుగుమిల్లీ మండలం బర్రింకలపాడు క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు సీయం సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. పేద ప్రజల ఆరోగ్య విషయం పట్ల శ్రద్ధ చూపించే ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మాత్రమే అని అన్నారు.