కలెక్టర్‌ను కలిసిన డీటీవో

కలెక్టర్‌ను కలిసిన డీటీవో

KMM: ఎట్టకేలకు ప్రభుత్వం జిల్లా రవాణా శాఖకు పూర్తిస్థాయి అధికారిని నియమించింది. ఇటీవల వెల్లడైన గ్రూప్-1 ఫలితాల్లో ఆర్టీవోలుగా ఎంపికైన పలువురికి శిక్షణ అనంతరం పోస్టింగ్ కేటాయించారు. వీరిలో హనుమకొండకు చెందిన ధర్మపురి జగదీష్‌ను ఖమ్మం DTOగా నియమించారు. ఇటీవలే ఆయన బాధ్యతలు స్వీకరించగా, అనంతరం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని మర్యాదపూర్వకంగా కలిశారు.