బాణసంచా విక్రయిస్తున్న వ్యాపారి అరెస్టు

బాణసంచా విక్రయిస్తున్న వ్యాపారి అరెస్టు

విశాఖ నగరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా బాణసంచా విక్రయిస్తున్న వ్యాపారిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. సుమారు రూ. లక్ష రూపాయల విలువైన బాణసంచాను స్వాధీనం చేసుకున్నారు. విజయనగరం జిల్లా జామిలో బాణసంచా గిడ్డంగిని ఏర్పాటు చేసుకుని ఇక్కడ అక్రమంగా అమ్మకాలు జరుపుతున్నట్లు సమాచారం అందడంతో దాడులు నిర్వహించారు.