హత్యాయత్నం కేసులో వ్యక్తి అరెస్ట్

హత్యాయత్నం కేసులో వ్యక్తి అరెస్ట్

VZM: హత్యాయత్నం కేసులో కొత్తవలస పట్టణం మంగళవీధికి చెందిన రవితేజను శుక్రవారం అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించామని సీఐ షణ్ముఖరావు తెలిపారు. ఈ నెల 7న, ఇదే ప్రాంతానికి చెందిన జగ్గుపల్లి ప్రసాద్ వద్ద నిందితుడు రూ.100 లాక్కున్నాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మద్యం మత్తులో రవితేజ చాకుతో ప్రసాద్‌ను గాయపరిచాడు. బాధితుడు కెజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు.