జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్

జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్

MHBD: జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని వివిధ వార్డులను, పారిశుధ్య నిర్వహణను స్వయంగా పరిశీలించారు. అనంతరం రోగులతో నేరుగా మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. నిరుపేద రోగులకు మెరుగైన వైద్యం అందించడంలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.