VIDEO: డివైడర్‌ను ఢీకొట్టిన ట్రక్కు.. తప్పిన ప్రమాదం
KRNL: శ్రీకాళహస్తి నుంచి కర్నూలు వస్తున్న భారీ ట్రక్కు శుక్రవారం తెల్లవారుజామున అదుపుతప్పి బిర్లా గేట్ వాల్మార్ట్ సమీపంలో డివైడర్ను ఢీకొంది. ఓ ప్రముఖ సంస్థకు చెందిన ట్రక్కు కూల్ డ్రింక్స్ లోడ్తో వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు డ్రైవర్ తెలిపారు. డ్రైవర్ నిద్రమత్తు వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని సమాచారం. ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.