నేటి నుంచి ఎన్టీఆర్ భవన్‌లో ప్రజావేదిక
AP: మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌లో ఇవాళ్టి నుంచి ప్రజావేదిక నిర్వహించనున్నారు. మంత్రులు, సీనియర్ నేతల ప్రజావేదికలో ఒక మంత్రి, ఓ సీనియర్ నేతను జత చేస్తూ ఈనెల 15 వరకు షెడ్యూల్ విడుదల చేశారు. మంత్రి లోకేష్ ఆదేశాల మేరకు ఇవాళ మంత్రి కొల్లు రవీంద్ర, గన్ని వీరాంజనేయులు వినతులు స్వీకరించనున్నారు. ప్రతి శుక్రవారం నియోజకవర్గాల వారీగా గ్రీవెన్స్‌లు జరగనున్నాయి.