రాష్ట్రస్థాయి బేస్ బాల్ పోటీలకు గురుకుల పాఠశాల విద్యార్థి
CTR: సదుం MJP గురుకుల కళాశాల విద్యార్థి రాష్ట్రస్థాయి బేస్ బాల్ పోటీలకు ఎంపికైనట్టు ప్రిన్సిపల్ శ్రీనివాస్ రెడ్డి బుధవారం తెలిపారు. సీనియర్ ఇంటర్ చదువుతున్న యశ్వంత్ చిత్తూరు లోని PVKN డిగ్రీ కాలేజ్‌లో నిర్వహిస్తున్న అండర్- 19 బేస్ బాల్ పోటీలో పాల్గొని రాష్ట్రస్థాయిలో జరిగే పోటీలకు ఎంపిక అయినట్లు ఆయన చెప్పారు.