'ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలి'
SRPT: ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించి, నెరవేర్చని హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు కుక్కడపు వెంకటేశ్వర్లు గౌడ్ అన్నారు. బీజేపీ రాష్ట్ర పార్టీ ఆదేశాలు జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలత రెడ్డి సూచనల మేరకు మండల కేంద్రమైన గరిడేపల్లిలో మంగళవారం తహసీల్దార్ స్రవంతికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.