మారని తలరాతలను మారుస్తాను: ఎమ్మెల్యే

NLR: ఉదయగిరి పట్టణ పరిధిలోని ఎస్టీ కాలనీ వాసుల 40 సంవత్సరాలుగా మారని తలరాతలను మారుస్తానని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పేర్కొన్నారు. మంగళవారం ఉదయగిరి పట్టణం పరిధిలోని ఎస్టీ కాలనీలో జరిగిన 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలో ఉదయగిరి నియోజకవర్గం రెవిన్యూ డివిజన్ కాబోతుందని అన్నారు.