ఆలయ కమిటీ సభ్యులతో సమావేశమైన ఎస్సై
ప్రకాశం: కంభం పట్టణంలోని శ్రీ అంకాలమ్మ ఆలయ కమిటీ సభ్యులతో ఎస్సై శివకృష్ణారెడ్డి గురువారం సమావేశమయ్యారు. ఆలయ భద్రత, నిర్వహణ మెరుగుపరచడానికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, హుండీ నగదు సకాలంలో లెక్కించుకుని భద్రపరచాలని ఆలయ కమిటీ సభ్యులకు సూచించారు. అలాగే ఆలయానికి రాత్రి వేళల్లో కాపలా ఉండే నైట్ వాచ్మన్‌ను నియమించాలని సూచనలు ఇచ్చారు.