VIDEO: చెప్పు దెబ్బలతో హోలీ వేడుకలు
యూపీలోని మధుర జిల్లాలో వింత ఆచారం వెలుగులోకి వచ్చింది. హోలీ అంటే రంగులతో జరుపుకుంటాం కానీ ఇక్కడ మాత్రం చెప్పులతో కొట్టుకుంటూ సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. ఇలా ఒకరినొకరు చెప్పులతో కొట్టుకోవడం వల్ల గ్రామంలోని దుష్టశక్తులు నశిస్తాయని వారి నమ్మకం. కొన్ని దశాబ్దాలుగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.