కారు ద్విచక్ర వాహనం ఢీ.. మహిళకు గాయాలు
GNTR: ఫిరంగిపురం మండలం నుదురుపాడు రైల్వే స్టేషన్ సమీపంలోని కర్నూలు-గుంటూరు రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. గిద్దలూరు నుంచి విజయవాడకు వెళ్తున్న కారు, నరసరావుపేట నుంచి సంక్రాంతిపాడు వైపు యాక్టివాను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీపై ప్రయాణిస్తున్న మహిళకు గాయాలయ్యాయి. స్థానికులు ఆమెను నరసరావుపేట ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.