'వైద్య శిబిరాలు వినియోగించుకోవాలి'
జిల్లాలో సోమవారం జరిగిన ‘స్వస్త్ నారీ సశక్తి పరివార్ అభియాన్’ కార్యక్రమంలో డీఎమ్‌హెచ్‌వో శ్రీనివాసులు శెట్టి మాట్లాడుతూ.. వచ్చే నెల 2 వరకు మహిళలు ఆరోగ్య పరీక్షలు చేయించుకొని వైద్య శిబిరాలను వినియోగించుకోవాలని సూచించారు. ఎంసీపీ (మదర్–చైల్డ్ ప్రోగ్రామ్) కార్డుల ద్వారా గర్భిణీలు, బాలింతలు, శిశువులకు ఉచిత టీకాలు అందిస్తామని తెలిపారు.