'ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పచ్చదనం కాపాడుకోవాలి'

NDL: నందికొట్కూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగము ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్.సునీత అధ్యక్షతన కాలేజ్ ఆవరణంలో గురువారం మొక్కలు నాటారు. ప్రిన్సిపల్ సునీత విద్యార్థినీ, విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పచ్చదనం కాపాడుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ఖాజా హుస్సేన్ విద్యార్థులు పాల్గొన్నారు