మేడారం జాతరకు సమన్వయ బందోబస్త్: సీపీ
MLG: తాడ్వాయి మండలం మేడారంలో సమ్మక్క–సారలమ్మ జాతరను సమన్వయంతో విజయవంతం చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ బుధవారం అధికారులను ఆదేశించారు. జాతర ట్రాఫిక్ బందోబస్త్ బాధ్యతలు అప్పగించడంతో ప్రధాన రోడ్లు, వాహన పార్కింగ్, హోల్డింగ్ ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం సమ్మక్క–సారలమ్మలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.