దొంగల ముఠా అరెస్ట్.. బైక్లు స్వాధీనం
ELR: ద్విచక్ర వాహనాలకు జీపీఎస్ ట్రాకర్లను కచ్చితంగా అమర్చుకోవాలని ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ సూచించారు. నూజివీడు, పెదవేగి, దెందులూరు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్న ఐదుగురు సభ్యులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి 21 వాహనాలను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ తెలిపారు. ఈ వివరాలను ఏలూరులో ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాకు వెల్లడించారు.