వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో సీపీఐ ఆందోళన
యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలంలో 17కు పైగా తేమ శాతం ఉన్న వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ సీపీఐ నాయకులు శనివారం ఆందోళన నిర్వహించారు. మండల కేంద్రంలో సీపీఐ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి నిరసన వ్యక్తం చేశారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు గాలయ్య మాట్లాడుతూ.. వరి ధాన్యం కొనుగోలు వేగవంతం చేసి రైతులను ఆదుకోవాలన్నారు.