VIDEO: విజయ్ దేవరకొండ దంపతుల సందడి!
NGKL: బల్మూర్ మండలం తుమ్మెనపేటలో కోలాహలం నెలకొంది. ఇటీవల వివాహం చేసుకున్న సినీ నటుడు విజయ్ దేవరకొండ, రష్మిక దంపతులు సోమవారం సొంత గ్రామానికి చేరుకున్నారు. వివాహ వేడుకల కోసం వచ్చిన ఈ జంటకు గ్రామస్థులు బ్యాండ్ మేళాలతో ఘన స్వాగతం పలికారు. తమ అభిమాన నటులను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి అభిమానులు భారీగా తరలివచ్చారు.