VIDEO: వైరల్ అవుతున్న వరంగల్ AI వీడియో
WGL: వరంగల్ నగరాన్ని పొగమంచు కమ్మేసిన నేపథ్యంలో నగరం ఊటిలా కనిపిస్తే ఎలా ఉంటుందో AI సాయంతో ఇవాళ రూపొందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రధాన రహదారులు, జంక్షన్లు, భద్రకాళి ఆలయం, ఖిలావరంగల్ తదితర ప్రాంతాలు పొగమంచుతో నిండినట్లు చూపించిన ఈ వీడియోను నగరవాసులు విస్తృతంగా షేర్ చేస్తున్నారు.