ఎస్-400 ముందస్తు డెలివరీ కోసం రష్యాకు డోభాల్

జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ వచ్చే వారం రష్యాలో పర్యటించనున్నారు. రష్యా వద్ద పెండింగ్లో ఉన్న ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల ముందస్తు డెలివరీ అంశంపై చర్చించనున్నారు. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో డోభాల్ పర్యటన ప్రాధాన్యం సంచరించుకుంది. పాక్ యుద్ధ విమానాలు, డ్రోన్లు, క్షిపణులను అత్యంత కచ్చితత్వంతో ఎస్-400 నేలకూల్చిన విషయం తెలిసిందే.