'తడిచిన ధాన్యం కొనుగోలు చేయాలి'
SRCL: చందుర్తి మండలం దేవుని తండా గ్రామపంచాయతీ పరిధిలో కురిసిన వర్షానికి ధాన్యం తడిచి ముద్దయింది. తాండకు చెందిన కొంతమంది రైతుల ధాన్యం వరదనీటికి కొట్టుకపోయిందని రైతులు వాపోయారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చి పది రోజులు అవుతున్న ఇప్పటివరకు కొనుగోలు ప్రారంభించలేదన్నారు. గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలన్నారు.