రోడ్డు ప్రమాదం.. స్పందించని అంబులెన్స్ సిబ్బంది
KMM: చింతకాని మండలం తిర్లాపురం సమీపంలో మంగళవారం కారు, బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు 108 అంబులెన్సు సమాచారం అందించారు. అయితే, సుమారు 30 నిమిషాలు గడిచినా అంబులెన్స్ రాకపోవడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చింతకానికి ప్రత్యేక అంబులెన్స్ సౌకర్యం కల్పించాలని అధికారులను కోరారు.