మొక్కలు ఎండిపోకుండా చర్యలు
JGL: పెగడపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో నాటిన మొక్కలు ఎండిపోకుండా ఉండేందుకు వాటికి నీటిని అందజేస్తున్నట్లు సర్పంచ్ అరుణ, పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. నంది చౌరస్తా నుంచి పోలీస్ స్టేషన్ వరకు రోడ్డు మధ్యలోని డివైడర్లపై ఉన్న మొక్కలకు గ్రామపంచాయతీ ట్యాంకర్ ద్వారా నీరందిస్తున్నామని తెలిపారు. మొక్కలను కాపాడంలో తమ వంతు బాధ్యత నిర్వహిస్తున్నామని సర్పంచ్ పేర్కొన్నారు.