మూడేళ్లయినా పూర్తికాని వంతెన పనులు
HYD: కొంపల్లి వంతెన నిర్మాణపు పనులు 2022లో ప్రారంభమయ్యాయి. పనులు ప్రారంభమై సుమారుగా మూడు సంవత్సరాల సమయం గడుస్తున్నప్పటికీ పూర్తికాక పోవడంతో అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం నరకయాతన అనుభవిస్తున్నామని తెలిపారు. పనుల్లో వేగం పెంచి సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందులో కాంట్రాక్టర్ల ఆలస్యం ఉందన్నారు.