'గణేశ్ ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలి'

KMR: ఎల్లారెడ్డి నియోజకవర్గంలో గణేశ్ ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించుకోవాలని ఆర్డీవో పార్థ సింహారెడ్డి అన్నారు. ఆర్డీవో కార్యాలయంలో శుక్రవారం గణేష్ ఉత్సవాలపై ప్రభుత్వ శాఖలు, పొలిటికల్ పార్టీలు, మత పెద్దల ప్రతినిధులతో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. గణేష్ ఉత్సవాల నిర్వహణపై హిందూ, ముస్లిం ప్రతినిధుల అభిప్రాయాలు, సూచనలను ఆర్డీవో స్వీకరించారు.