రూ. 19,760 విలువైన మద్యం స్వాధీనం

రూ. 19,760 విలువైన మద్యం స్వాధీనం

HNK: పరకాల పట్టణంలో అనుమతి లేకుండా అక్రమంగా బెల్టు షాపుల్లో మద్యం విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు మంగళవారం రాత్రి రెండు షాపుల్లో సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో రూ. 19,760 విలువైన మద్యం స్వాధీనం చేసుకుని, కుక్కల శ్రవణ్ కుమార్, ఊరుగొండ రాజేందర్ అనే ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు టాస్క్ ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపారు.