నేవీ అమ్ములపొదిలో మరో అస్త్రం
భారత నౌకాదళ లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని పెంపొందించే దిశగా కీలక ముందడుగు పడింది. గోవా తీరంలో పీ8ఐ విమానం ద్వారా ADC-150 ఎయిర్ డ్రాపబుల్ కంటైనర్ పరీక్షను విజయవంతంగా నిర్వహించారు. 150 కిలోల బరువును మోసుకెళ్లగల ఈ స్వదేశీ పరికరం, సముద్రం మధ్యలో ఆపదలో ఉన్న నౌకలకు అత్యవసర వైద్యం, కీలక పరికరాలను వేగంగా సరఫరా చేస్తుంది. DRDO శాస్త్రవేత్తల కృషి ఫలితానికి ఇది నిదర్శనం.