ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

NLR: చేజర్ల మండలం ఆదురుపల్లి గ్రామంలోని శ్రీకృష్ణ మందిరంలో జన్మాష్టమి వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం నుండి భక్తులు స్వామివారి దర్శనార్థం తరలి వచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు శ్రీకృష్ణుడికి ప్రత్యేక అలంకరణలు చేసి అర్చనలు నిర్వహించగా, భక్తులు హారతులు ఇచ్చి శ్రద్ధాభక్తులతో ప్రార్థనలు చేశారు.