నేటి నుంచి జిల్లాలో ప్రత్యేక పాలన
BPT: జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల సర్పంచ్‌ల ఐదేళ్ల పదవీకాలం బుధవారంతో ముగిసింది. దీంతో గ్రామాల్లో ప్రజాప్రతినిధుల పాలనకు తెరపడగా, గురువారం నుంచి ప్రత్యేక అధికారుల పాలన రానుంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకంలో జాప్యం కారణంగా స్థానిక ఎన్నికల నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. ఎన్నికల నగారా మోగే వరకు ప్రభుత్వ అధికారులు నిబంధనల బాధ్యతలను పర్యవేక్షించనున్నారు.