ఆర్టీసీ, ట్రావెల్స్ బస్సు ఢీ.. 30 మందికి గాయాలు

ఆర్టీసీ, ట్రావెల్స్ బస్సు ఢీ.. 30 మందికి గాయాలు

TG: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరులో ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో నలుగురి పరిస్థితి విషమంగా ఉండగా మరో 30 మందికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో శ్రీశైలం రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.