సాలూరలో దివ్యాంగుల దినోత్సవం
NZB: అంగవైకల్యాన్ని జయించి ఆత్మవిశ్వాసంతో జీవించాలని మండల విద్యాశాఖ అధికారిణి (ఎంఈవో) రాజీమంజుష సూచించారు. దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం జడ్పీహెచ్ఎస్‌లో కార్యక్రమం నిర్వహించారు. ఎంఈవో మాట్లాడుతూ.. దివ్యాంగ విద్యార్థుల్లోని అపార సామర్థ్యాలను గుర్తించి ప్రోత్సహించాలన్నారు. వారు కృషి చేస్తే గొప్ప విజయాలు సాధిస్తారని పేర్కొన్నారు.