VIDEO: హుజూర్‌నగర్‌లో మొంథా తుఫాను ప్రభావం
సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తుంది. భారీ వర్షాల వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. పలుచోట్ల చేతికి వచ్చిన పంట నేలపాలు అయింది. ఉదయం 7:00 వరకు చింతలపాలెం మండలంలో 15.8 మి.మి వర్షపాతం నమోదైంది. మేళ్లచెరువు 59.0, మఠంపల్లి 68.5, పాలకీడు 80.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.