కాంగ్రెస్ పార్టీలో చేరికలు
MBNR: మూసాపేట మండలం జానంపేట గ్రామానికి చెందిన BRS నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. 3వ వార్డు సభ్యుడు రాజు గౌడ్, సుదర్శన్ గౌడ్, జైపాల్ గౌడ్, నరసింహులు గౌడ్, సురేందర్ గౌడ్ సహా పలువురు కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరారు. వీరికి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి ఘనంగా ఆహ్వానించారు. ప్రజా పాలన చూసే పార్టీలో చేరుతున్నట్లు వారు పేర్కొన్నారు.