పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించాలి
SRPT: పశుపోషకులు నిర్లక్ష్యం చేయకుండా తమ పశువులకు టీకాలు వేయించాలని పశుసంవర్ధక శాఖ ఏడీ డాక్టర్ వెంకన్న కోరారు. సోమవారం తుంగతుర్తి మండలం అన్నారంలో గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని ఆకస్మికంగా సందర్శించి మాట్లాడారు. ఈ వ్యాధి సోకితే పశువులలో పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోతుందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నరేష్, సిబ్బంది పాల్గొన్నారు.