జిల్లా ఎస్పీను కలిసిన సత్యవేడు ఎమ్మెల్యే

జిల్లా ఎస్పీను కలిసిన సత్యవేడు ఎమ్మెల్యే

TPT: సత్యవేడు నియోజకవర్గం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సోమవారం తిరుపతి ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ హర్షవర్షన్ రాజును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో శాంతి భద్రతకు సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఎస్పీను కోరుతూ వినతి పత్రం సమర్పించారు. ఎస్పీ సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.