విషాదం.. కల్తీ పాల ఘటనలో మరొకరు మృతి
E.G: రాజమండ్రి కల్తీ పాల ఘటన పలు కుటుంబాల్లో విషాదం నింపుతోంది. ఈ ఘటనలో ఇప్పటికే 9 మంది మృతి చెందారు. తాజాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అనంతలక్ష్మి (72) మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 10కి చేరింది. కాగా ఈ ఘటనలో ఇంకా పదిమంది బాధితులు వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు.