చీమలపేటలో NCD ఔట్ రీచ్ క్యాంప్

చీమలపేటలో NCD ఔట్ రీచ్ క్యాంప్

PDPL: జూలపల్లి మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో గురువారం చీమలపేట గ్రామంలో NCD ఔట్ రీచ్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వైద్యాధికారి డాక్టర్ సంపత్ కుమార్ పర్యవేక్షణలో గ్రామస్తులకు పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పాలకవర్గ సభ్యులు, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.