కంకర క్వారీలో అనుమానాస్పద మృతి

NLR: రాపూరు మండలం పులిగిలపాడులోని ఎస్ఎల్వీ రామిరెడ్డి కంకర క్వారీలో ప్రొక్లైన్ ఆపరేటర్ గుర్రం శ్రీను అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. క్వారీలో పని చేసే సిబ్బంది కొట్టి చంపారని మృతుని బంధువులు ఆందోళన చేస్తున్నారు. ప్రొక్లైన్‌లోనే గుర్రం శ్రీను మృతి చెంది ఉండడం గమనార్హం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేపట్టారు.