వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

నిజామాబాద్: పట్టణంలోని సీతారాం నగర్ కాలనీలో ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారంతో 5వ టౌన్ ఎస్సై అశోక్ సిబ్బందితో కలిసి గురువారం దాడులు నిర్వహించారు. నిర్వాహకులతో పాటు ఐదుగురు మహిళలు, మరో ఇద్దరిని అరెస్టు చేసి వారి వద్ద నుండి నగదు, సెల్ పోన్లను స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. మహిళలను సఖి కేంద్రానికి తరలించారు.