“నేను మీ ఓటు” అంటూ వైరల్ సందేశం

“నేను మీ ఓటు” అంటూ వైరల్ సందేశం

ఉమ్మడి వరంగల్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా “నేను మీ ఓటు. నేటి నా పుట్టుక ఐదేళ్ల ప్రభావం. డబ్బు కోసం కాదు, ధర్మం కోసం నన్ను ఉపయోగించండి. సేవ చేసేవారికి అప్పగించండి” అంటూ ఓటు తరఫున రాసిన సందేశం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిజం, బాధ్యత చూసి సరైన అభ్యర్థికి ఓటేయాలని పిలుపునిస్తూ ఈ సందేశం ఓటర్లను ఆకట్టుకుంటోంది.