బాధిత కుటుంబాలను పరామర్శించిన మంత్రి సీతక్క

MLG: ములుగు జిల్లా వాజేడులో మందుపాతర పేలుళ్లలో మరణించిన ముగ్గురు పోలీసుల మృతదేహాలకు మంత్రి సీతక్క గురువారం నివాళులు అర్పించారు. అనంతరం పోలీసు కుటుంబాలను ఓదార్చి ధైర్యం చెప్పారు. పోలీసుల త్యాగాలను ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరన్నారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామన్నారు.